ప్రకాశం జిల్లా డీసీహెచ్‌ఎస్ (District Coordinator of Hospital Services – DCHS) పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు ఏరియా ఆసుపత్రుల్లో ఒప్పందం మరియు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరోగ్య రంగంలో సేవ చేయాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ప్రకాశం జిల్లా DCHS రిక్రూట్‌మెంట్ 2025 – 16 పోస్టులు | దరఖాస్తుకు చివరి తేదీ: 24-03-2025
మొత్తం ఖాళీలు: 16
పోస్టు పేరు | ఖాళీలు | జీతం (రూ.) |
---|---|---|
ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ | 01 | ₹32,670 |
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్2 | 02 | ₹32,670 |
థియేటర్ అసిస్టెంట్ | 03 | ₹15,000 |
ఆఫీస్ సబార్డీనేట్ | 02 | ₹15,000 |
పోస్ట్ మార్టం అసిస్టెంట్ | 02 | ₹15,000 |
జనరల్ డ్యూటీ అటెండెంట్ | 06 | ₹15,000 |
అర్హత:
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, B.Sc, DMLT ఉత్తీర్ణత అవసరం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ చేసి ఉండాలి.
వయోపరిమితి (01-07-2024 నాటికి):
గరిష్ఠ వయస్సు: 42 ఏళ్లు
ఎక్స్‌సర్వీస్‌మెన్‌కి: 3 ఏళ్లు సడలింపు
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌కు: 5 ఏళ్లు సడలింపు
దివ్యాంగులకు (PwD): 10 ఏళ్లు సడలింపు
దరఖాస్తు ఫీజు:
OC అభ్యర్థులకు: ₹500
బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: ₹300
ఎంపిక విధానం:
విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
24-03-2025 లోపు ఫుల్‌ఫిల్ చేసిన దరఖాస్తును పంపాలి.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
Office of the DCHS, Prakasam District (మరిన్ని వివరాలకు జిల్లా అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు)
Notification | Click here |
Official Site | Click here |