TSEMR Schools: తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలు 

తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్‌ ట్రైబ్‌ కేటగిరీలకు చెందిన విద్యార్థులు మార్చి 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష వివరాలు…

అడ్మిషన్‌: తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు ఆరో తరగతి ప్రవేశాలు

పరీక్ష పేరు: ఈఎంఆర్‌ఎస్‌ సెలెక్షన్‌ టెస్ట్‌(ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌టీ)- 2024

సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు ఉన్నాయి. 

అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు తప్పనిసరిగా 2023-24 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

వయోపరిమితి: మార్చి 31, 2024 నాటికి ఆరో తరగతికి 10-13 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఆరో తరగతికి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ(50 ప్రశ్నలు), అరిథ్‌మెటిక్‌(25 ప్రశ్నలు), లాంగ్వేజ్‌(25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100. 

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు… 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 22-03-2024.

ప్రవేశ పరీక్ష నిర్వహణ: 21.04.2024.

పరీక్ష ఫలితాల ప్రకటన: 13.04.2024.

మొదటి దశ ప్రవేశాలు: 23.05.2024.

రెండో దశ ప్రవేశాలు: 05.06.2024.

TSEMR Schools: తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలు 

Apply OnlineClick here
NotificationClick here
Official SiteClick here

Telangana Jobs

Disclaimer

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info