5,204 Staff Nurse Exam in Online Mode

5,204 Staff Nurse Exam in Online Mode | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వేర్వేరు విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) గత ఏడాది డిసెంబరులో నియామక ప్రకటనను విడుదల చేసింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో జవాబుపత్రం ఉంటుందని ఆ నియామక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇటీవల ప్రశ్నపత్రాల వరుస లీకేజీ ఘటనల దృష్ట్యా… రాతపరీక్ష విధానానికి స్వస్తి చెప్పాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. నర్సింగ్‌ పోస్టుల భర్తీలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను నిర్వహించాలని ఇటీవల వైద్య మంత్రి హరీశ్‌రావు వద్ద జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలను ఎలాగైతే కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహిస్తున్నారో… అదే తరహాలో నర్సింగ్‌ పోస్టుల భర్తీ పరీక్షను కూడా నిర్వహించాలని తీర్మానించారు. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాన్ని జేఎన్‌టీయూ రూపొందించనుండగా… ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణలో అపార అనుభవమున్న ఓ సంస్థకు నర్సుల పోస్టుల నియామక పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగించారు. వచ్చే వారంలో నియామక పరీక్షకు సంబంధించిన తేదీని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటించనుంది. పరీక్ష ప్రకటన తేదీకి.. నిర్వహణ తేదీకి మధ్య కనీసం రెండు నెలలు ఉండేలా ప్రణాళిక రూపొందించింది. జులైలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత సంస్థకు వైద్యశాఖ సూచించింది.

ఒకే రోజు… రెండు పరీక్షలు!

జేఎన్‌టీయూ నిపుణుల బృందం రూపొందించిన ప్రశ్నపత్రాల్లో ఏవైనా రెండింటిని పరీక్షకు కొద్ది నిమిషాల ముందు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న మొత్తం 40,900 మందికి పైగా అభ్యర్థులను రెండు గ్రూపులుగా కంప్యూటర్‌ ఆధారంగానే ర్యాండమ్‌గా విభజిస్తారు. ఏ గ్రూపులో ఏ అభ్యర్థి వస్తారనేది నిర్వాహకులకు కూడా తెలియదు. వీరికి ఒకే తేదీన ఉదయం 9-12 గంటల వరకూ ఒక పరీక్ష… మధ్యాహ్నం 2-5 గంటల వరకూ మరో పరీక్షను నిర్వహిస్తారు. రెండు ప్రశ్నపత్రాలూ వేర్వేరుగా ఉంటాయి. గతంలో రాతపరీక్షకు ప్రకటించినట్లుగానే… ఆన్‌లైన్‌ పరీక్షలో కూడా అన్నీ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. ఒక ప్రశ్నకు సమాధానం రాసిన తర్వాతే మరో ప్రశ్న కంప్యూటర్‌ తెరపై కనిపిస్తుంది. నిర్దేశిత సమయంలో ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థికి ఒకటో ప్రశ్న కనిపిస్తే.. మరో అభ్యర్థికి 50వ ప్రశ్న కనిపించే అవకాశాలుంటాయి. పరీక్షలో పాల్గొంటున్న ప్రతి అభ్యర్థికీ ఏక కాలంలో ఒకే ప్రశ్న కనిపించే అవకాశాలుండవని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వర్గాలు స్పష్టం చేశాయి.

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లను పరీక్ష కేంద్రాలుగా ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థులు ఈ నాలుగింటిలో ఏ రెండింటినైనా కచ్చితంగా ఎంచుకోవాలి. హైదరాబాద్‌ నుంచి దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువమంది ఉండడంతో.. ఇక్కడ పరీక్ష కేంద్రాలు ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం బాధ్యత కూడా ఎంపిక చేసిన సంస్థదే. ఆ ఫలితాలకు వెయిటేజీ మార్కులను జోడించి, అర్హుల్లో 1:2 నిష్పత్తిలో నియామక జాబితాను రూపొందిస్తారు. వీరి అర్హత ధ్రువపత్రాలనే సరిచూస్తారు. అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. నర్సులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తొలిసారి కావడంతో.. వారికి ఈ విషయంలో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అభ్యర్థులకు అవగాహన కోసం.. పరీక్ష తేదీని ప్రకటించిన రోజునే.. టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో నర్సింగ్‌ నియామక ప్రశ్నపత్రం నమూనాను అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

Disclaimer – Tsjobs.info

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

Tsjobs.info