సైన్స్, మాథ్స్ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్ ఒకటి. తాజాగా నెస్ట్-2024 ప్రకటన వెలువడింది.
ఇందులో రాణించినవాళ్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైసర్), భువనేశ్వర్; యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే ఏడాదికి రూ.60,000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంటర్న్‌షిప్ కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున గ్రాంట్ ఇస్తారు.
పరిశోధనల దిశగా ప్రోత్సాహం…
విద్యార్థులకు సైన్స్ కోర్సుల్లో ఆసక్తి పెంచి, పరిశోధనల దిశగా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్టు (నెస్ట్) ఏటా నిర్వహిస్తున్నారు. బోధన, పరిశోధన రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, అధునాతన ల్యాబ్ సౌకర్యాలు, ఉన్నత ప్రమాణాలు.. నైసర్, సీఈబీఎస్‌ల ప్రత్యేకత. విదేశీ శాస్త్రవేత్తలు సైతం ఇక్కడ బోధిస్తారు.
ఈ సంస్థల్లో బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు. నైసర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు ఉన్నాయి. అన్ని సెమిస్టర్లలోనూ మేటి ప్రతిభ చూపిన విద్యార్థులకు భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ట్రైనింగ్ స్కూల్లో పరీక్ష రాయకుండానే ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అనుమతి లభిస్తుంది. ఇలా ఎంపికైనవారు శిక్షణ అనంతరం బార్క్‌లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష వివరాలు…
* నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2024
సీట్ల రిజర్వేషన్:
నైసర్(200 సీట్లు): జనరల్- 101, జనరల్ ఈడబ్ల్యూఎస్- 0, ఓబీసీ ఎన్సీఎల్- 54, ఎస్సీ- 30, ఎస్టీ- 15, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.
సీఈబీఎస్(57 సీట్లు): జనరల్- 23, జనరల్ ఈడబ్ల్యూఎస్- 6, ఓబీసీ ఎన్సీఎల్- 15, ఎస్సీ- 9, ఎస్టీ- 4, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.
అర్హత: సైన్స్ గ్రూప్‌లతో 2022, 2023లో ఇంటర్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి.
వయసు: వయోపరిమితి లేదు.
ప్రశ్నపత్రం: పరీక్ష రెండు సెషన్లలో.. ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వీటిని 4 సెక్షన్లలో అడుగుతారు. సెక్షన్ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక్కో సెక్షన్‌కు 60 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్లో 20 ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్య తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 20 నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రారంభం: జూన్ 15.
పరీక్ష తేదీ: జూన్ 30.
ఫలితాల ప్రకటన: జులై 10.
ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1400. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.700.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
NEST – 2024 : ఉన్నత విద్యతో పాటు 60 వేల ఉపకార వేతనం
Apply Online | Click here |
Notification | Click here |
Official Site | Click here |
MLHP Posts Under NHM, Siddipet
MLHP Vacancies Under NHM Telangana
Junior Research Fellow at IIT Hyderabad
Telangana Jobs
Disclaimer – Tsjobs.info
This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.