తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను (TS ENTRANCE TESTS 2024 SCHEDULE and EXAM DATES) విడుదల చేశారు. మొత్తం 7 ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశారు.
EAMCET ఇక EAPCET
ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. అయితే ఎంసెట్ పేరును ఉన్నత విద్యామండలి మార్చింది. టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
TS EAPCET 2024 – (TS EAMCET)
మే 9 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించున్నారు.
మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్ నిర్వహించనున్నారు.
TS ECET 2024 –
మే 6వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది.
TS EdCET 2024 –
మే 23న జరగనుంది. బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించనుంది.
TS LAWCET & PGLCET 2024 –
జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు. 3 ఏండ్ల న్యాయవిద్య, 5 ఏండ్ల లా కోర్సులో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ లా సెట్ ఎంట్రన్స్ టెస్ట్.. అదే రోజు… ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టును కూడా నిర్వహించనున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌లను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
TS ICET 2024 –
జూన్ 4, 5వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష.. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జరగనుంది.
TS PGECET 2024 –
జూన్ 6 నుంచి 8 తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష… హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు జరగనున్నాయి.
TS PECET 2024 –
జూన్ 10 నుంచి 13వ తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్టును శాతవాహన యూనివర్సిటీ నిర్వహించనుంది.
TS ENTRANCE TESTS 2024 – వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్
MLHP Posts Under NHM, Siddipet
MLHP Vacancies Under NHM Telangana
Junior Research Fellow at IIT Hyderabad
Telangana Jobs
Disclaimer – Tsjobs.info
This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.